Feeds:
టపాలు
వ్యాఖ్యలు

చిరుగారు !

ఆర్కుట్ గురించి తెలియని వారుండరు. ఇందులో రక రకాలైన అభిరుచులు గల వారు గ్రూపులుగా ఏర్పది ఉంటారు. వీరికి సందేశమివ్వాలంటే ఆ గ్రూపులోకి ప్రవేశించక తప్పదు.

ఆడవి దొంగ నుండి అల్లుడా మజాకా సినిమా వరకు నేనుసైతం మీ అభిమానినే. అల్లుడా మజాకా సినిమాలోని బూతు డైలాగులు,అశ్లీల ద్రుశ్యాలతో విసిగి మీకు దూరమయ్యాను.

పాపం అభం శుభం తెలియని కుర్రాళ్ళు చిరు మాయలో కొట్టుకు పోయి బంగారు భవితను పోకొట్టుకుంటున్నారే అన్న భాధ తో మీ గురించి నాలుగు మాటలు మెసేజ్ పెట్టాను.

అందుకు రక రకాలైన భూతులను స్క్రాబ్ చేస్తున్నారు. చంపుతామని,తంతామని బెధిరంపులు వేరు.

ఈ నేపథ్యంలో మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా !

మీరు అరిచి గీ పెట్టే మార్పు ఇదేనా?
పి.సి.సి.ని తగుల పెడితే కాంగ్రెస్ వారు శాంతియుతంగా నిరశన వ్యక్తం చేస్తున్నారు.

మీ గురించి ఉన్న మాట చెప్పినందుకు మీ అభిమానులు భూతులు తిడుతూ చంపుతామంటున్నారు.

ప్రజలు ఇవన్ని గమనిస్తూనె ఉన్నారు.

అందరు పార్టి పెట్టాక ,పొరబాతున గెలిచాక అవినీతికి పాల్పడుతారు ..కాని మీ విషయానికొస్తే పార్టి పెట్టి పెట్టకనే వసూళ్ళు జరిగినట్లు గా అరోపణలొస్తున్నాయి.

మిగిలిన పార్టిల్లో ఏ 5 సం.లకో మాత్రమే వలసలు జరిగేవి. కాని మీ పార్టిలో చేరిన కొన్ని నెలలకే వలస వెళ్ళిపోతున్నారు.

ఎన్.టి.ఆర్ హరిక్రుష్ణను కేవలం చైతన్య రథసారథిగా మాత్రమే వాడారు.

మీ పార్టిలో ఏమో పవన్,నాగ బాబు,అల్లు అరవింద్ తప్ప ఇంకెవ్వరికి ఏ పవరూ ఉన్నట్టు కనిపించటం లేదు.

సినిమాల్లో ఉంటూ కోట్లాది రూపాయల నల్ల దనాన్ని పారితోషికంగా స్వీకరించిన మీరు ఇప్పుడు అవినీతి గురించి మాట్లాడటం హేయంగా లేదా?

పోని మీ స్వంత ప్రాపర్టిని పరిటాల వద్దనుండి కాపాదుకో లేక చంద్రబాబుతో పంచాయితీ పెట్టి విఫలమయ్యారని ఒక సమాచారముంది.

మీ ఆస్తినే కాపాదుకోలేని మీరు రాష్ట్రాన్ని ఎలా కాపాడుతారు?

అయ్య! మీ కుటుంబంలోని ఇద్దరు స్త్రీలకు న్యాయం చెయ్య లేని మీరు రాష్ట్రంలోని మహిళాలోకానికి న్యాయం చెయ్యగలరని ఎలా నమ్మ మంటారు?
మీరే చెప్పారు..ప్రతి విమర్శకు పాల్పడమని సేవతోనే సమాదానం ఇస్తామని. ప్రతి విమర్శకాదు కదా మీ ప్రసంగాల్లో ముప్పావు సమయం విమర్శలు,ఆధారాల్లేనివిమర్శలకే,ఆరోపణలకే సరి పెడుతున్నారు.

రోజా అమ్మా అంటే షోబా రాణి నీయమ్మా అనే స్థితిలో మీ పార్టి ఉంది. మీ అభిమానుల్లో,మీ మహిళారజ్యం నేతల్లోనే మార్పు తే లేని మీరు మార్పు తెస్తానంటే ఎలా నమ్మమంటారు.

పథకాల అమల్లో అవినీతి జరిగిందన్నా అది అతికినట్టుంటుంది. మీరేమో అవినీతి కోసమే పథకాలు అమలవుతున్నాయంటున్నారు.

వికలాంగుల పట్ల ఎంతో శ్రద్ద చూపిన మీ పార్టిలో మీరు అధికార ప్రథినిధిగా నియమించిన పరకాల ప్రభాకర్ వికలాంగుల మనోభావాలు దెబ్బ తినేలా మాట్లాడారు, ఈ విషయం పై మీ స్పందన ఏమిటో ఇందాకా వెలుబడ లేదు..
చెరో చేనల్,చెరో పేపరు పెట్టుకుని స్వంత డబ్బా కొట్టుకుంటూ,వై.ఎస్., జగన్,సాక్షి పత్రికల పై నిందాపనిందలను వేస్తున్నారు. మీరు రాజకీయ ప్రవేశం చెయ్యడానికి కొన్ని నెలలనుండి ఆంథ్ర జ్యోతి మీకు విపరీత ప్రచారం ఇచ్చింది. దీనికి గాను వారేం ఆసించారు? మీరు దేనిని తిరస్కరించారు? ఆ దేవునికే ఎరుక..

ఇప్పటికైనా సరే వసూలు చేసిన డబ్బులు ఆయా నేతలకు వెనక్కిచ్చి తప్పుకొండి. చూడటానికి వచ్చిన జనమంతా ఓట్లేస్తారని భ్రమిస్తే షెడ్ అయిపోతారు.

వై.ఎస్.అమలు చేసిన పథకాలతో ప్రతి కుటుంభంలో కనీశం ఒక్కరన్న లబ్ది పొందియున్నారు. మన ప్ర్జలకు జ్ఞాపక శక్తి ఎక్కువ. క్రుతజ్ఞతా భావం ఎక్కువ. మీరు రేపొచ్చి ఇస్తానంటున్న వాతికన్నా,చేస్తానన్న వాటికన్నా ఇది వరకే తాము పొందిన వాటినే గుర్తు పెట్టుకుంటారు.

(మీకో రహస్యం చెప్పనా ..మీరు ఎంత బాగా తిరిగితే వై.ఎస్.కు అంతగా లాభం చేకూర్చిన వారవుతారు. వ్యతిరేక ఓట్ల మీద ఆశతో తె.దే.పా బరిలో ఉంది. ఆ వ్యతిరేక ఓట్లను మీరు ఎంతగా చీచితే వై.ఎస్.,కాంగ్రెస్ పార్టీలకు అంతగా లాభం..కీప్ ఇట్ అప్)

గమనిక:

ఇదేమి కొత్త విషయాలు ఏవీ ప్రస్తావించలేదనుకోకండి. ఇవన్ని 2009 ఎన్నికలకు పూర్వం వ్రాసినవి. అప్పట్లో ఇండియన్ పిలిటికల్ క్లోసప్ అనె నా బ్లాగులో చిరు,వై.ఎస్. జాతకాలు అనలైజ్ చేసి వై.ఎస్. మళ్ళీ సి.ఎం అవుతారు ..మెజారిటి కాస్త తగ్గొచ్చంతే చిరుకు ఇరవై ముప్పై సీట్లు వ్వస్తే ఎక్కువ అని వ్రాసాను. ఈ విషయాన్ని చిరు ఫ్యేన్స్ (ఆర్కుట్ ) తెలుపగా వారి స్పందన – ఆ స్పందన పై నేను వ్రాసిన ఓపెన్ లెటర్ ఇది


టామి అని,టైగర్ అని పేర్లుండడం చూసి మీకు మీరై ఇవి రెండూ వేర్వేరు జీవరాశులని ఊహించుకోకండి. రెండూ అక్షరాల పులులే. ఈ రెండు పులులు  చిత్తూరు కలెక్టర్ బంగళాలో కలుసుకున్నాయి. అప్పుడు ఆ రెండూ ఒకరికొకరు చెప్పుకొన్న ఆత్మకథలను క్లుప్తంగా ఇస్తాను. ఆతరువాత సంభాష్ణలోకి ఎళదాం
టామి టైగురుకు చెప్పుకున్న ఆత్మ కథ:
మా తాత ఒక టైగర్. ఆయన పేరు చెబితే  ఆ ప్రాంతమంతా హడల్. ఇప్పటికీ కొందరికి ఆయన పేరు చెప్పుకుంటే వళ్ళు పులకరిస్తుంది. కొందరికైతే వళ్ళు జలదరిస్తుంది. మా నాన్న కూడ ఒక టైగర్. మొదట జిల్లా లెవలు. ఆపై రాష్ఠ్ర్రం లెవల్లో ఎదగాలని అప్పట్లో ఆయన అభిమానులు తపించేవారు. అందుకు అదేదో పెద్ద సర్కస్ కంపెని ఉందని అందులో చేరితే అలా ఎదగొచ్చని సలహా ఇచ్చేవారు. అతనో సర్కస్ కంపెనిలో చేరాడు.
ఆ కంపెనికి దేశ వ్యాప్తంగా శాఖలుండేవి .మా నాన్న ఆంథ్ర ప్రదేశ్ శాఖలో చేరాడు. మా నాన్న పులే. కాని ఆ కంపెనిలో వృధాగా తిని కూర్చున్న  ముసలి నక్కలు ఆయన్ని బలే ఇబ్బంది పెట్టేవారు.
మా నాన్న తాను పుట్టి పెరిగిన  అడవి, అది తనకిచ్చిన స్వేచ్చ, భలం, ఆత్మవిశ్వాసం, దాని సౌందర్యం అన్ని తలచుకుని మదనపడుతూ రింగ్ మాస్టర్లు చెప్పిన విదంగా ఏవేవో ప్రోగ్రామ్స్ ఇచ్చేవాడు. జనం కూడా భాగానే మెచ్చుకునేవారనుకో. కాని ఈ రింగ్ మాస్టర్లు సర్కస్ ఓనరమ్మను కలిసి మా నాన్న ఇంకా ఆడవిని మరిచి పోలేదని, స్వేచ్చా జీవి అని, మొరటోడని ఎప్పటికైనా ఓనరమ్మకే ఎదురు తిరుగుతాడని పెద్ద ప్రోగ్రామ్స్ ఏవి ఇవ్వకూడదని చాడి చెప్పేవారు.
అప్పుడప్పుడు బఫూన్లను మా నాన్న మీద రింగ్ మాస్టరుగా నియమించేవారు. ఒక దశలో  ఈ అవమానాలు భరించలేక మరికొందరు పులులు ఇతరత్రా జంతువులతో ఆ సర్కస్ కంపెని వదిలి పెట్టి భయిటకొచ్చేసాడు. వీరందరు కలిసి చిన్న సర్కస్ కంపెని ఒకటి పెట్టేరు.
కాని ప్రకృతి నుండి దూరంగా దూరంగా వచ్చేసిన జనం, ఆహార వేటకు ఇరవై కిలో మీటర్లు తిరిగే శక్తి ఉన్నా పక్క వీథిలోని మెస్ కి టూవీలర్లో వెళ్ళి రోగాలు తెచ్చుకునే జనం
” నువ్వు సర్కస్లో ఎం చక్కా వార్తలు చదివేవాడివి, ఏం చక్క తోకతో పల్లు తోముకునేవాడివి .బంతాట ఆడేడివి ఆ సర్కస్లో నీ ప్రోగ్రామ్ బలే ఉండేదని” ఊరించేరు.
దీంతో విధిలేక మానాన్న అదే కంపెనిలో చేరారు.పెద్ద ఓనరమ్మ పోయి ఆమె కొడుకొచ్చాడు,కొడుకు పోయి కోడలొచ్చింది. కాని చాలా మంది మేధావులు ఆ సర్కస్ కంపెనియే చట్ట విరుద్దమని, సర్కస్ కంపెని నెపంతో స్కేమ్స్ చేస్తున్నారని అదని ఇదని దర్ణాలు,రాస్తా రోకోలంతా చేసేరు.
కంపెనికి బలే చెడ్డ పేరు వచ్చేసింది. కలెక్షన్ బాగా పడి పోయింది. రాష్ఠ్ర్రంలో  గూడారమే ఖాళి చెయ్యాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఆ తరుణంలో కొత్త ఓనరమ్మ  నీ మీద ఏ రింగ్ మాస్టర్లు ఉండరు , ఏం చేసినా నువ్వే అని చెప్పి హెడ్ ఆఫీసుకెళ్ళి పోయింది.
మా నాన్న అష్ఠ కష్ఠాలు పడి  ఇక్కడ ఉన్న గబ్బిలాలు, నక్కలు,తోడేళ్ళను మ్యేనేజ్ చేస్తూ ప్రోగ్రామ్స్ ఇస్తూ  కంపెనిని మంచి స్థాయికి తెచ్చేసాడు. ఈ ప్రయత్నంలో నేను అతని బిడ్డగా అతను అందుభాటులో లేనప్పుడు అతని ప్రతిథిగా చిన్నా చితకా ప్రోగ్రామ్స్ ఇస్తుండేవాడ్ని.  ఒక ఐదేళ్ళు ఏ సమస్యా లేకుండా పోయింది. మా నాన్న ఎంత పెద్ద పులి అయినప్పటికి అలవాట్లో పొరభాటుగా వై? (ఎందుకు?) అని ప్రశ్నించినా చివరికి ఎస్ అని చేసేవాడు. పులిబిడ్డనైన  నాకు సైతం టామి అని పేరు పెట్టారంటే చూసుకో.
కష్ఠాల్లో ఉన్న మెయిన్ బ్రాంచ్ పార్ట్నర్ షిప్పులు కలిసి క్రమేణా స్థిర పడటం మొదలైంది.మెయిన్ బ్రాంచ్  స్థిర పడేసరికి రాష్ఠ్ర్రంలోని బ్రాంచ్ రానింపు కొద్దిగా తగ్గింది. పాత సర్కస్ కంపెని ఒకటి టిక్కెట్ ఫ్రీ, పాప్ కార్న్ ఫ్రీ అని ప్రకటించడం ,  కొత్త సర్కస్  కంపెని ఒకటి కొత్తగా రావడం. అందులో రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి వంటి పెద్ద పెద్ద డైరక్టర్ల దగ్గర పని చేసిన ఒక పులి ఉండటం వల్ల ఇలా రానింపు తగ్గినా ఉనికికి ప్రమాదం రాకుండా ఉండేందుకు సర్కస్ కంపెని అడవర్టైజ్మెంట్ కోసం నేను ఒక టివి చానల్, దినపత్రిక పెట్టడంతో గండం గట్టెక్కింది.
దీంతో ఓనరమ్మ దీని పై దృష్ఠి సారించింది. పూర్వంలోలాగా పెత్తనం చెయ్య దలచింది.ఆ సమయానికి మా నాన్న ఓక కుట్రకు బలై పోయాడు. ఎలాగూ సర్కస్లోని జంతువుల గురించి భాగా తెలిసినవాడ్ని, మా నాన్నతో కలిసి మెలిసి పని చేసి వాటి లొసుగులు తెలిసిన వాడ్ని,జనం నాడి తెలిసినవాడ్ని , సర్కస్ దివాళా తీసి పోకుండా చానల్,పత్రిక నడిపిన వాడ్ని కాబట్టి నన్నే ఇన్ చార్జిగా పెడతారనుకున్నాను. ప్చ్! చివరికి నన్ను బఫూన్ చెయ్యాలని (చూ)చేసేరు.
దీంతో విసిగి పోయి ఇలా వచ్చేసాను.

టైగర్ టామికి చెప్పుకున్న ఆత్మ కథ:
అయ్యో పాపం! నీ కథ గనక వింటే గనక నా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూంది. నువ్వన్నావే కొత్త టైగర్ -కొత్త సర్కస్ కంపెని అని. ఆ టైగర్ ని నేనే. కొత్త కంపెని ఏమీ లాభసాటిగా నడవడం లేదు. సర్కస్ పెట్టిన కొత్తలో గోడ దూకి వచ్చినవారిలో సగం మంది  మొదటి  ఫోప్రారంభం కాక మునుపే వెళ్ళి పోయేరు. మిగిలిన సగం మంది అది  పూర్తికాక ముందే గోడ దూకి వెళ్ళి పోయేరు.
నువ్వా  సర్కస్ కంపెని వదిలి పెడితే ఆ సర్కస్ దివాళా తీయకుండా ఉండేందుకు నన్ను రమ్మన్నారు.  మీ నాన్నలాగే నేనూ ఒక అడవిలో రారాజుగా ఉన్నవాడ్నే. కాని ఆ అడవిలోకి కుర్ర పులుల రాకతో ఎక్కడ డి ఫేమ్ అయిపోతానోనని కొత్త సర్కస్ కంపెని పెట్టా బేడ్ లక్. ఇలా అయ్యింది . సర్లే పెద్ద కంపెని కదా చేరిపోదామని భయలు దేరాను. నీ మాటలు వింటుంటే గనక రేపు నా బతుకూ ఇంతేనేమో?
అన్నట్టు మనమిద్దరం కలిసి ఒక  సర్కస్ కంపెని పెడితే ఎలా ఉండేదో ఆలోచించు..
కొంత చర్చల అనంతరం టామి టైగర్ల మద్య ఒక అవగాహణ కుదిరింది. రెండూ చెట్టా పట్టాల్ వేసుకుని భయలు దేరాయి.  కలెక్టర్ సి.సి సిగరట్ తాగాలని వచ్చి ఈ రెండు పులుల ఐక్యతా  రాగం  విని  అదరి,వెదరి,చెదరి పరుగులు తీస్తూ వెళ్ళి కలెక్టరుగారికి విన్నవించాడు.
కలెక్టర్ వనికి పోతూ సర్కస్ కంపెనికి ఫోన్ చేసి కొత్త మ్యేనేజరుకు విషయం చెప్పాడు. కొత్త మేనేజర్  చేతులు కట్టేసుకుని, నోటి మీద వ్రేలు పెట్టేసుకుని హెడ్ ఆఫీసుకి ఫోన్ చేసి విషయం చెప్పగా చిర్రెత్తిన ఓనరమ్మ , ” వెంటనే కలెక్టర్ బంగళాకెళ్ళు ..రెండు ఫ్లాస్కులు తీసుకో .. ..తెచ్చి ఫ్రిడ్జిలో పెట్టేసుకుని ..రోజుకి మూడు పూట్లా సేవించు” అనేసి నెత్తి పట్టుకుంది.


టామి అని,టైగర్ అని పేర్లుండడం చూసి మీకు మీరై ఇవి రెండూ వేర్వేరు జీవరాశులని ఊహించుకోకండి. రెండూ అక్షరాల పులులే. ఈ రెండు పులులు  చిత్తూరు కలెక్టర్ బంగళాలో కలుసుకున్నాయి. అప్పుడు ఆ రెండూ ఒకరికొకరు


ఆనాటి చందమామలో రాకుమారులు రాక్షసులతో శతవిదాల పోరాడి ఓడిపోతారు. చివరికి ఎవరో ఋషి క్లూ ఇస్తే సప్త సముద్రాలు దాటుకుని వెళ్ళి అంత పెద్ద రాక్షసుని ప్రాణాలను ఏ పిచ్చికలోనో,ఎలుకలోనో ఉంటే వాటిని చంపి రాక్షసుడ్ని చంపేవారు.

మానవులను దేశద్రోహులుగా, క్రిమినల్స్ గా, లంచ కుండీలుగా ( ఈ లిస్ట్ చాలా పొడవైంది కాబట్టి ఇక్కడికి ఆపుతున్నాను) మార్చేసేవి అతని ఆలోచనలే. ఒక మనిషిలోని ఆలోచనలన్నీ ( పాజిటివ్ + నెగటివ్) కార్య రూపం దాలుస్తే సమాజం పని గోవిందా.. అమలు కాకుంటే అతని మానసిక ఆరోగ్యం గోవిందా..

ఇదేం చిక్కు ? దీనికి పరిష్కారం లేదా?

మానవుల ఆలోచనలు కూడ అంతే పైకి చూడటానికి ఎంతో గజి బిజిగా, జఠిలంగా, ఉండి ఆల్జీబ్రాలా తికమక పెడతాయి. కానీ ఆలోచనల మూలాలను చేదించ కలిగితే అవి రెండో ఎక్కంలా ఇట్టే అర్థమై పోతాయి.

ఇటీవల కాలంలో సైన్స్ భాగా అభివృద్ది చెందింది. మనుషుల్లోని వివిధ ప్రవృత్తులకు కారణం రక్తంలో కలిసే కొన్ని రసాయనాలే అని నిర్థారించేరు. మీరు పిరికి పందగా ఉండటానికి కారణం అదో రసాయనం . మీ పక్కింటి యాంగ్రి యంగ్ మేన్ చెయిన్ స్మోకరుగా ,విమనైజరుగా, ఎదవగా ఉండటానికి కారణం అదేదో కెమికల్.

వీటిని స్రవించేవి గ్రంథులు. గంథుల రారాజు హైపోతలామస్. హైపోతలామస్ యొక్క ఆజ్నానుసారమే ఇతర గ్రంథులు పని చేస్తుంటాయి. అంటే మానవునిలో వివిధ ప్రవృత్తులను, చెలరేపే రసాయనాలను స్రవించడం అన్న మాట.

ఈ గ్రంథులను కట్టిడి చేసే హైపోతలామసును కట్టిడి చేసేవి మన ఆలోచనలే. హమ్మయ్యా .. ఒక వృత్తం ( రౌండ్) పూర్తైంది. అవును బాసూ ఈ సృష్ఠిలో అన్నీ వృత్తాకారంలోనే ఉంటాయి. మీరు ఎంత పొడవాటి గిర్రను గీసినా అది ఒక వృత్తాకారంలోని భాగమే. దాని సాగదీస్తే అది ఖచ్చితంగా వృత్తమై తీరుతుంది.

సమస్యలకు మూలం రసాయనాలని చెప్పి- వాటికి కారణం గ్రంథులని చెప్పి- వాటిని కట్టిడి చేసేది హైపోతలామసేనని చెప్పి- చివరికి ఆ హైపోతలామసును కట్టిడి చేసేది మన ఆలోచనలే అంటే బి.పి పెరిగిపోదూ? చిర్రెత్తదూ?

కాని ఇది నిజం. సత్యం. క్యేబరే లాంటి అర కొరా సత్య కాదు . నగ్న సత్యం. మరి ఆలోచనలకూ మూలాలు ఎక్కడున్నాయి? సెక్సు పరిచయమైన విదానంలో ఉంటాయి. సెక్సును ఎదుర్కొన్న రీతిలో ఉంటాయని పాత మాటే చెబుతాననుకుంటే పప్పులో కాలేస్తారు.

సైకాలజి పిల్లవాడు పెరిగే వాతావరణం అతని క్యేరక్టరును,ఆలోచనా విదానాన్ని నిర్ణయిస్తుందని సైకాలజి చెబుతూంది. కాని నా అనుభవంలో చూసినప్పుడు ఆ వాతావరణాన్ని సైతం అతని జాతకమే నిర్ణయిస్తుంది.

ఉదాహరణకు: ఒక పిల్లవాడు కన్యారాశి/లగ్నంలో పుటాడనుకొండి. అరే కడుపులో పడ్డాడనుకొండి. క్రమేణా అతని చుట్టూ ఉన్నవారిలో ఒకరు రోగిష్ఠిగా ఒకరు అప్పుల అప్పారావుగా,ఒకరు కోర్టు కేసులకు తిరిగేవారుగా, తయారవుతారు.

ఇదెందుకూ అంటే ఆ పిల్లవాని భవిష్యత్ కూడ ఇదే కాబట్టి ఆ వాతావరణంలో పెరిగితేనే వాడలా తయారవుతాడని.

సైకాలజి చెప్పే కాన్సెప్టు కరెక్టే. పెరిగిన వాతావరణమే మన ఆలోచనలను నిర్థారిస్తాయి. మరి ఆ వాతావరణాన్నే నిర్ణయించేవి గ్రహాలైనప్పుడు ఏం చెయ్యాలి?

అందరూ నావద్ద జ్యోతిష సలహా తీసుకొండని కేన్వాస్ చెయ్యను. బేసికల్ గా నేను హ్యుమేనిస్టుని. చాలా మంది జ్యోతిష్కులు ఇన్ హ్యూమన్ గా ఇర్రెస్పాన్సిబిల్ గా బిహేవ్ చెయ్యడం చూసి అదేందో చూద్దామని దిగినవాడ్ని. నాకు జోతిషం వచ్చు కాని నేను కేవలం జ్యోతిష్కుడను కాను.కాలేను.

పోనీ పై పిల్లవాడు కన్యా రాశి/లగ్నంలోనే ఎందుకు పుట్టాలి? దీనిని నిర్ణయించిన శక్తి ఏది? అంటే అది అతనే. ఇదెలా సాధ్యమని మీరడగొచ్చు. చెబుతా.

మనిషి కోతినుండే వచ్చాడు. కాని అన్ని కోతులూ మనిషి కాలేదుగా? కాని ఏదో ఒక రోజు కావచ్చుగా?

ఇదే ది లా (Law) ఇక్కడ కూడ పని చేస్తుంది. ప్రతి మానవుడు ఏదో రోజు ముక్తిని పొందాలి (ముక్తి మీన్స్ జనన మరణ చక్రం నుండి విడిపడటం)

Action – Reaction థియరి ప్రకారం ప్రతి ధ్వనికీ ప్రతిధ్వని వినిపించి తీరుతుంది. నేను ఇక్కడ ఏదో మొక్కకి నీరు పోస్టే నాలోను ఏదో భాగం తడుస్తుంది. నేనో పువ్వును పీకి పారేస్తే నాలోనుండి కూడ ఏదో రాలి పోతుంది. మోక్షం -ముక్తి అంటారుగా ఈ సంస్థ సృష్ఠినుండి నేను వేరు కాను. నేనీ సృష్ఠిలో విడదీయలేని ఒక అంతర్భాగాన్ని అని ఎక్స్ పీరియన్స్ కావడమే ముక్తియేమో?

ఈ స్థితికి చేరుకునేంత వరకు పునరభి జననం పునరభిమరణం కొనసాగుతూనే ఉంటుంది. సారీ ………సబ్జెక్టునుండి కాస్త పక్కకు పోయాననిపిస్తూంది . హు.. ఆ పిల్లాడి కథకే వస్తాం అతను ఎందుకు ఆ రాశి లగ్నంలోనే పుట్టాలి?

ప్రతి ఆత్మయొక్క టార్గెట్ తాను సృష్థిలోని అంతర్భాగమని ఎక్స్ పీరియన్స్ కావడమే. కాని అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు ఈ స్థితి అసాధ్యమవుతుంది.

మీ చేతిలో గొడుగున్నప్పుడు మీరు వానలో తడువగలరా? గొడుగే లేకుంటే నొచ్చుకుంటూనో, తిట్టుకుంటూనో తడిచి తీరతారు. నిండా మునిగినవానికి చలి లేదు చందాన ఒక స్థితిలో వానను ఎంజాయి చెయ్యడం కూడ మొదలు పెడతారు.

ఇక్కడ వానంటే సృష్ఠి. గొడుగు అంటే మీ లైఫ్ సెక్యూరిటి . అలానే మానవుడు భధ్రత కోసం ఉవ్విళ్ళూరినంత కాలం వాడు తను సృష్ఠిలో ఒక భాగమని తెలుసుకోలేడు.

సమస్యలకు దూరంగా ఉన్నంత కాలం అతను సృష్ఠికి దూరంగానే బ్రతికేస్తుంటాడు. మనిశియొక్క శరీరం,మనస్సు,భుద్ది పూర్తిగా విఫలమైనప్పుడే అతనికి ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది.

గత జన్మలో మరణానంతరం తాను ఆత్మ స్వరూపుడుగా ఉన్నప్పూడు, ఆ జన్మలో ఎటువంటి భధ్రతలు ,ఎటువంటి సుఖాలు తనను కేవలం శరీరంగా,మనస్సుగా,భుద్దిగా ఫీలయ్యేలా చేసి ఆత్మ సాక్షాత్కారానికి దూరం చేసాయో వాటినంతా లిస్ట్ అవుట్ చేసుకుని – సతరు భధ్రతలు,సుఖాలు లేని జీవితాన్నిడిసైన్ చేసుకుని, అటువంటి జీవితాన్ని కలుగ చేసే గ్రహస్థితి వచ్చేంత దాకా కాచుక్కూర్చొని, అందుకు అనువైన తల్లి ,తండ్రులకు అనువైన వాతావరణంలో పుడుతుంది.

నిజానికి మీ జీవితం మీరు ఓకే చేసిన స్క్రిప్టే. కాని మనలో ఎవరికీ తమ జీవితం మీద సంతృప్తి లేదు. ఎంతటి మహాత్ముడైనా ఏదో ఒక తరుణంలో ” తూ ..నా.. బతుకు..” అని విసుక్కోకుండ ఉండరు.

ఈ జీవితాన్ని ఏరి కోరి ఎంపిక చేసి కాచుక్కూర్చున్నప్పుడు మీరు ఆత్మ స్వరూపులుగా ఉన్నారు. ఇప్పుడు ఆత్మను ఈగో మూసేసింది. అప్పట్లో మీ ద్యేయం ముక్తి.ఇప్పట్లో మీ ద్యేయం భుక్తి. మనం కోరుకున్న జీవితమే ప్రసాదించ బడినప్పుడు ఆలోచనలకు అవసరమేముంది?

కాని మనం పొరబడ్డాం . ఎవరో ఎక్కడ నుండో ఒక పనికి మాలిన స్క్రిప్టు వ్రాసి అందులో మనలను భలవంతంగా ఇరికించేసారని పొరబడ్డాం .అందుకే ఇన్ని ఆలోచనలు. ఆలోచనల మూలం మరేమి లేదు

ఒక పక్క జీవిస్తూనే మరో పక్క జీవితాన్ని విశ్లేషించుకోవడం, అలా ఉంటే ఇలా ఉంటే,అలా జరిగి ఉంటే ,ఇలా జరిగి ఉంటే అని ఊహించుకోవడం, ఇదెక్కడికి దారి తీస్తుందో ? ఈ సమస్య ఎలా ముంచనుందోనని గాబరా పడటం ఇవే మన ఆలోచనలన్నింటికి మూలం.

స్క్రిపుటు వ్రాసింది మనమేనన్న చిన్న విషయాన్ని అర్థం చేసుకో కలిగితే ఆలోచనలకసలు తావే లేదు. జస్ట్ బతికేస్తుంటాం. హైపోతలామస్ పర్ఫెక్టుగా పని చేస్తుంది. ఇతర గ్రందులను చక్కగా కట్టిడి చేస్తుంది. రసాయనాలు చక్కగా స్రవిస్తాయి. మన ప్రవృత్తి ప్రకృతికి అనుగుణంగా ఉంటుంది.

కావల్సిందల్లా జస్ట్ అర్థం చేసుకోవడమే…

మవుతూ ఉంటాడు.


మన దేశం ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతూంది. ప్రస్తుతం మనకు స్థూలంగా కనిపించే ఎన్నోసమస్యలు అసలు సమస్యలే కావు. కనిపించే ప్రతి సమస్యకు మూలం పేదరికం. ఈ పేదరికానికి కారణం జన భాహుళ్యానికి జాతీయ ఉత్పత్తిని పెంచే ప్రక్రియలో సమాన అవకాశం లేక పోవడం. అలానే జాతీయ ఆదాయంలో నిజమైన వాటా లభించక పోవడం.  మన ఆర్థిక శాస్త్ర్ర వేత్తలు జాతీయ ఆదాయాన్ని జనాభాతో భాగించి వచ్చిన మొత్తాన్ని తలసరి ఆదాయంగా పేర్కొంటూ భారతీయులు సంపన్నులై పోతున్నారని ఊదర కొడుతున్నారు. రజిని కాంత్ సం.ని ఒక సినిమా అధనంగా చేసినా, తమిళ నాడు ముఖ్యమంత్రి మనవళ్ళల్లో ఒకరు ఇంకో కొత్త చానల్ ప్రరంభించినా జాతీయ ఆదాయం పెరుగుతుంది.  కాని ఆ ఆధాయంలో ఒక పేద ఆంథ్రునికో, తమిళుడికో వాటా వస్తుందా ? అంటే రాదు.

ఈ అసలు సమస్యను గుర్తించి నేను రూపొందించిన విప్లవాత్మక పథకమే ఆపరేషన్ ఇండియా 2000. ఈ పథకాన్ని నాడు గూగుల్ ప్రకటించిన ప్రోజెక్ట్ టెన్ టు హండ్రెడ్ కి పంపినాక దాని పై బ్రవుజర్లకు అవగాహణ కల్పించి వారి మద్దత్తు కూడ కట్టుకోవడం కొరకు రోపొందించిందే ఈ డి.వి.డి.

దీనిని యధా ప్రకారం ఆర్చివ్ ఆర్గ్ లో అప్  చేసి దాని తాలూకు లింకును ఇక్కడ ఇస్తున్నాను. డౌన్ లోడ్ చేసుకుని తిలకించి నా పథకం పట్ల మీ అభిప్రాయాలను తెలుపుటకు   ఇక్కడ నొక్కండి


డబ్బు గురించిన మర్మాలను చేధించ కోరి చిత్తూరు టైగర్ సైట్ కు విచ్చేసిన మీకు స్వాగత సుమాంజలులు !
ఈ పేజి చివర ఇచ్చిన కొన్ని లింకులను వన్ బై వన్ కాపి పేస్ట్ చేసి ఎంటర్ కొడితే చాలు మని సీక్రెట్స్ డి.వి.డిలోని మూడు భాగాలను  కొన్నినిమాషాల్లో  డవున్ లోడ్ చేసుకుని  ప్రశాంతంగా  తిలకించి ఆనందించ వచ్చు. డబ్బు గురించిన రహస్యాలను ఇట్టే తెలుసుకుని మీ భ్రమలను పోగొట్టుకుని సంపాదనకు పూనుకోవచ్చు. సంపన్నులుగా మారొచ్చు.

వెంటనే మీరు కంట్రోల్ ,ఎండ్ బటన్ నొక్కి ఈ పేజి చివరి భాగానికి వెళ్ళి పోయినా అది నేరమేమి కాదు సుమా! కాని ఈ డి.వి.డి నేపథ్యాన్ని కాసింత తెలుసుకుంటే ఇంకా భాగా అర్థమవుతుందేమో?

గత మార్చ్  24న  చిత్తూరు  టైగర్, ప్రజానాయకులు,చిత్తూరు  ఎమ్.ఎల్.ఏ శ్రీ  సి.కె. బాబు గారి జన్మ దినోత్సవం సందర్బంగా విడుదల చేసిన “మని సీక్రెట్స్ ” గురించిన డి.వి.డిని ఇంటర్ నెట్ నుండి ఉచితంగా డవున్ లోడ్ చేసుకునే వీలు కల్పించటం వెనుక గొప్ప ఆశయమే ఉంది. అదే పేదరిక నిర్మూలనం.

పేదరిక నిర్మూలనే ద్యేయంగా పని చేసిన దివంగత రాష్ఠ్ర ముఖ్యమంత్రులు ఎన్.టి.రామారావు, డా..వై.ఎస్.రాజశేఖర రెడ్డిలే ఇందుకు స్ఫూర్తి. ఎన్.టి.ఆర్  వలే , వై.ఎస్.ఆర్ వలే  స్థానికంగా సి.కె.బాబు పేదల పక్షపాతిగా పేరొందిన వ్యక్తి కావడంతో  ఈ   మని సీక్రెట్స్ డి.వి.డిని సి.కె.పుట్టిన రోజున విడుదల చేసాం.
సతరు డి.వి.డి ప్రతిని సి.కె.గారికి చేర వేయగా వారి సతీమణి సి.కె.లావణ్య ఎటువంటి హిపాక్రసి లేక స్వయంగా  ఫోన్ ద్వారా మాట్లాడి  సంతోషం వ్యక్తం చేసి ప్రోత్స హించడం నిజంగా గర్వకారణం.

చిత్తూరు శ్రీ కృష్ణా జ్యుయలర్స్ వారి సౌజన్యంతో పాజిటివ్ థింకర్స్ క్లబ్ వారు స్థానిక  జడ్పి మీటింగ్ హాలులో  నిర్వహించిన  సెమినార్లో నేను  చేసిన ప్రసంగం యొక్క సంపూర్ణ దృశ్యమాలికతో ఈ డి.వి.డి రూపుదిద్దుకున్నది.

డబ్బు లేని వారు ఉండొచ్చుగాని డబ్బు అవసరం లేని వారు ఎక్కడా లేరు. అయితే డబ్బు గురించిన సరైన అవగాహణ లెక  మానవులు  నానా తంటాలు పడుతున్నారు. ఇంతకీ డబ్బుయొక్క శక్తిని  మానవుడు అతిగా ఊహించుకోవడం, మరణం, మరణం యొక్క ఛాయలైన ఒంటరితనం,చీకటి,తిరస్కారం, ముసలితనం, ఓటమి, జబ్బులనుండి రక్షిస్తుందని సబ్ కాన్షియస్ గా  భావించడం వలనే డబ్బును సరిగ్గా అర్థం చేసుకోలేక పోయాడు మానవుడు.

డబ్బు గురించిన అపోహలను తొలగించి,ప్రతివారిని సంపాదనకు పూనుకునేలా చెయ్యడమే ఈ డి.వి.డి లోని ప్రసంగం యొక్క ద్యేయం.

అందుకే సతరు డి.వి.డిని  ప్రతి ఒక్కరికి అందుభాటులో తేవాలని  చక్కగా కంప్రెస్ చేసి మొబైల్ ఫోన్లో సైతం డవున్లోడ్ చేసుకునే విదంగా ఆన్ లైన్ లో ఉంచాను.

ఇంకా ఆలస్యం ఎందుకు ?
క్రింది లింకులను కట్ పేస్ట్ చేసి డి.వి.డిని డవున్ లోడ్ చేసుకొండి !
Money secrets Part 1
http://www.archive.org/details/MoneySecretsByMurugeshan1
Money secrets Part 2

Money secrets Part 3
http://www.archive.org/details/MoneySecretsPart3

ఇట్లు,

చిత్తూరు.ఎస్.మురుగేశన్


డా. వై.ఎస్ మరణానంతరం ఆ బాధ తట్టుకోలేక మరణించిన కుటుంభాలను ఓదార్చటానికంటూ జగన్ చే పట్టిన  ఓదార్పు యాత్రలో జీర్ణించుకోలేని అంశాలు కొన్ని ఉన్నాయి. మొదటిది ఇంత ఆలశ్యంగా ప్రారంభించటం. వై.ఎస్. మరణించి వారం పది రోజుల్లో తమ కుటుంభ పెద్దను / ముఖ్యులను పోగొట్టుకున్న కుటుంభాలను ఓదార్చటానికి  ఆరు నెలలనంతరం వెళ్ళటమే.

ఏ పనికన్నా ఒక కాల పరిమితంటూ ఉంది. కాని జగన్ ఈ విషయంలో మరో ఆలశ్యం చేసాడు.

సరే అయినదేమో అయినది. కనీశం కార్యక్రమ రూపకల్పణలోనన్నా కాసింత జాగ్రత్తలు తీసుకుని ఉండవలసింది.ఎన్నికల ప్రచారంలా ఆ డప్పులు, కాన్వాయి, అసహ్యంగా ఉన్నాయి

పోని ఇతనేమన్నా పది ఇరవై లక్షలు ఆ కుటుంభానికి సాయం చేస్తున్నాడా అంటే అదీ లేదు. జగన్ సాయం ఒక్క లక్షే

ఇది కాల్ రూపాయి కోతి ముక్కాలు రూపాయి బెల్లం తిన్నట్టుంది.  ఇతను చేయనున్న సాయమేమో లక్ష రూపాయలే. కాని కార్యక్రమ నిర్వహణకు ఖర్చు వంద రెట్లు

జిల్లాకో కార్యక్రమం అదీ విమానాశ్రయం దగ్గర్లోనే  ఇండోర్ లో ఏర్పాటు చేసుకుని హృదయానికి హత్తుకునే విదంగా నిర్వహించి ఉండ వచ్చు. చేసే సాయం ఏదో నిజంగానే సతరు కుటుంభాన్ని నిల బెట్టే విదంగా ఉండి ఉంటే మంచిది.

ఇవన్ని ఒక ఎత్తైతే ఈ కార్యక్రమం గురించి సాక్షి మరియు ఇతర (కొన్ని) చేనల్స్ లో చేసే ప్రచారాల హడావుడు చాలా విడ్డూరంగా ఉన్నాయి.

జగన్ మనస్తత్వం ఎవరికీ అర్థం కానిదై ఉంది. వై.ఎస్. చని పోయినప్పుడే సంతకాల సేఖరన  చేపట్టిన జగన్ మరెందుకో మెత్త బడి పోయారు. అలా చెయ్యడం సాంఘికంగా తప్పేమో గాని రాజకీయంగా తెలివైన చర్యే.  ఆ తరువాత ఇడుపులపాయలో పెద్ద భహిరంగ ఏర్పాటు చేసారు. సోనియా పేరన్నా ఎత్తకనే ప్రసంగం పూర్తైంది. పైగా కెమరాలకు ప్రధానంగా  త్రివర్ణ పతాకం మద్యలో వై.ఎస్. బొమ్మ ఉన్న జెండా కవర్ అయ్యేలా చేసారు. ఇదీ తెలివైన ఎత్తే. పార్లెమెంటులో గోల్డెన్ తెలంగాణా నినాదం కూడ క్శమార్హమే .

కాని రిలయన్స్ ఉదంతం, క్యేన్సర్ వ్యేక్సిన్, ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు  విద్యుత్తును భయిట  విక్రయించుకునే  వెసలు బాటు కల్పించటాన్నివ్యతిరేకించి నాలుక కరచుకోవడం జగన్ పై నా బోటివారికి ఉన్న విశ్వాసాన్ని  చాలా తీవ్రంగా దెబ్బ తీసాయి.

ఎలాగూ రోశయ్యతో కాని, రాహుల్ తో గాని, సోనియాతో గాని, పార్టిలోని సీనియర్ల తో గాని పొత్తు పొసగ లేదు. రానున్నవి స్థానిక ఎన్నికలే. వీటిలో పార్టికన్నా అభ్యర్దికే ప్రాధన్యత ఉంటుంది. జగన్ కాంగ్రెస్ వై.ఎస్. పార్టి స్థాపించడానికి ఇదే అనువైన కాలం.  ఇలా తన ఉనికిని చాటుకుంటే కొత్త పార్టి తదుపరి ఎన్నికల్లోపు భలపడవచ్చు, సోనియా మనస్సు మార వచ్చు.

ఈ ఓదార్పు యాత్రలు, ఈ హడావుడీలు ఎన్ని రోజులు గుర్తుంటాయి. జగన్ ఆలోచించాలి.



అవును. అటు సోనియ,ఇటు రాష్ఠ్ర నాయకత్వం జగన్ కున్న ప్రజా బలాన్ని గుర్తించ లేదు. పైగా జగన్ గారిని ఎలాగన్నా తొక్కి పెట్టాలనే చూస్తున్నారు. ఇది ఈ ఏడు నెలల్లో భాగా రుడీ అయిపోయింది .ఈ పరిస్థితిలో ఓదార్పు యాత్ర ,రాజ్కీయం మాట్లాడనువంటి ముసుగులో గుద్దులాటలు జగన్ కు అనవసరం.

తెగించి కొత్త పార్టి ప్రకటించాలి. రానున్నవి స్థానిక ఎన్నికలే. వీటిలో పార్టికన్నా అభ్యర్దులను చూసే జనం ఓటేస్తారు. ఈ యాత్రలు పాడు పరదేశాలకు ఖర్చు పెట్టుకోవడానికంటే సూటిగా కొత్త పార్టి పతాకం క్రింద స్థానిక ఎన్నికల్లో విజయ ఢంకా మృఓగిస్తే అటు దిల్లి, ఇటు రాష్ఠ్రంలోని గల్లీలు కదులుతాయి.

జగన్ ఆలోచించండి !


సాధారణంగా సం. ఫలితాలు చెప్పినప్పుడు శని,గురు,రాహు, కేతువులను బట్టి ఫలితాలు చెబుతుంటారు. ఇది ఒక విదంగా తర్క సమ్మతమే. పై గ్రహాలు ఒక్కో రాశిలో సం.లు తరబడి ఉండి ఫలితాలిస్తుంటారు. కాని వీరికన్నా భలవంతుడు,ఫల వంతుడు కుజుడు. అందుకే నేను కుజ గ్రహ సంచారాన్ని పట్టి ఫలితాలు చెప్ప దలచాను.

కుజ గ్రహం యొక్క విశిష్ఠత:
జాతకాలు చూచు వారు తక్కిన గ్రహాల స్థితి  బాగా లేక పోతే ఆ గ్రహం భాగాలేదు,ఈ గ్రహం బాగా లేదు అంటారు. కాని  ఒక్క కుజ గ్రహ స్థితి భాగా లెకుంటే మాత్రం “అమ్మో ! ఇది దోష జాతకమని ప్రక్కన పెడతారు

ఎందుకంటే ఇతర గ్రహాలు భాగాలేకుంటే వారికి సంభందించిన జబ్బులే వస్తాయి. ఫలానా గ్రహం భాగాలేదు. ఫలానా జబ్బొస్తుందని చెప్పవచ్చు. కాని కుజ గ్రహం రక్తానికి,రక్తంలోని తెల్లకణాలను తయారు చేసే ఎముకల్లోని బోన్ మ్యేరోకి అధిపతి. తెల్లకణాల గురించి తెలుసుగా ? మనిషికి వ్యాధి నిరోధక శక్తినిచ్చే గ్రహం కుజుడు. అట్టి కుజుడు జాతకంలో భాగా లేకుంటే బోన్ మ్యేరో దెబ్బ తింటుంది. అది తయారు చేసే తెల్లకణాల సంఖ్య తగ్గి పోతుంది.వ్యాధి నిరోధక శక్తి పడి పోతుంది.అప్పుడేమవుతుంది ? ఏ జబ్బన్నా వచ్చే అవకాశం కలుగుతుంది.

ఇదో ఎత్తైతే కుజుడు కోపానికి కారకుడు. కోపం వస్తే ఎంతటి గుణవంతుడైనా గుణ హీనుడవుతాడు, ఎంతటి బుద్దిమంతుడికన్నా బుద్ది ప్రకోపిస్తుంది. దాని పర్యావసనం ఎలా ఉంటుందో మీరే ఊహించుకొండి

మరో కోణం కూడ ఉంది. కుజగ్రహన్ని గ్రహాల సైన్యాధిపతిగా పేర్కొంటారు.రాజు ఎక్కడో మందు కొట్టి పడుకుని ఉన్నా సైన్యాన్ని నడిపేది సైన్యాధిపతియే. అట్టి సైన్యాధిపతియొక్క ఆజ్న లేనిదే సైన్యం (ఇతర గ్రహాలు) కదులుతుందా? కదలదు.

అందుకే జాతకంలో కుజునికి వెనుక ఉన్న గ్రహాలను గ్రహ యుద్దంలో ఓడి పోయిన గ్రహాలుగా ,శక్తి హీన గ్రహాలుగా పరిగణిస్తారు.

మనిషికి దైర్య,సాహసాలను ఇచ్చే గ్రహం కుజుడు. ఇతను ఒక రాశిలో సంచరించే కాలం దాదాపుగా 45 రోజులే అయినప్పటికి ఆ 45 రోజుల్లో అధ్భుతాన్ని సృష్ఠిస్తాడు. చిత్తూరు.ఎం.ఎల్.ఏ సి.కె.బాబు మూడవ పర్యాయం పోటీలో ఉన్నప్పుడు అతని జన్మ రాశి అయిన మకరానికి ఒక్క కుజుడు తప్పా అన్ని గ్రహాలు ప్రతికూలమే. సి.కె.పై పోటికి దిగిన అభ్యర్థి రాశి సింహం.ఒక్క కుజ గ్రహం మినహా అన్ని గ్రహాలు అనుకూల స్థితిలో ఉన్నాయి. గ్రహస్థితి ప్రభావం కారణంగా నాటి ప్రభుత్వం సి.కె.పై,సి.కె.అనుచర గణాల పై ఎన లేని ఆంక్షలు విధించింది.  షేడో పార్టీలంటూ,ఎస్కార్ట్ అంటూ సి.కె.వెనుక బలగాలను మొహరింప చేసేరు.కనీశం ఫోలింగ్ బూతుల్లో పోలింగ సరళి గురించి తన అనుచరులను వాకబు చేద్దామన్నా కుదరని పరిస్థితి. ఈ దుందుడుకు చర్యల పై ఎన్నికల రోజున సాయంత్రం  సి.కె. నేతృత్వం కూడ నిరసన  ర్యాలి కూడ నిర్వహించారు. కాని చివరికి ఏమైంది. ముచ్చటగా సి.కె. మూడో సారి ఎం.ఎల్.ఏ అయ్యారు. ఇదీ కుజ గ్రహం యొక్క గొప్పదనం. అందుకే 2010 లో మీ భవిష్యత్తును కుజ గ్రహ స్థితిని పట్టి వివరించాలని నిర్ణయించాను

ఏప్రల్ 5 నుండి 26 వరకు సింహంలో కుజ గ్రహ సంచారంవలన ద్వాదశ రాశులవారికి ఫలితాలు:
మేషం:
కోపం,శ్రుంగ భంగం, పుత్ర నష్టం .కాని అనుకోని రీతిలో భూ లాభం,అదృష్ఠం వరించును
వృషభం:
దారిద్రియం,తల్లి,ఇల్లు,వాహణం,విథ్యా వగైరాల్లో చిక్కులు,చికాకులు,
మిథునం:
ప్రయాణాల్లో అనుకూలత,దైర్య సాహసాలాతో లాభం, కాని సోధర హాని
కర్కాటకం:
నిష్ఠూర వాక్కు,దన నాశం,కుటుంభ కలహం,ఉష్ణ రోగాలు,కాని హఠాత్తుగా అనుకోని చోట నుండి లాభం
సింహం:
రక్తం,మంట సంభంద జబ్బులు, కోపం,ఆయుధాలు,అగ్ని,విద్యుత్ వలన హాని
కన్య:
ఇందనాలు,విద్యుత్,విద్యుత్ పరికరాలు మొరాయించటం ద్వారా దన నష్ఠం. సోదర వర్గంవలన వృధా వ్యయాలు
తుల:
ఇందనాలు,విద్యుత్,విద్యుత్ పరికరాలు ద్వారా ,సోదర వర్గం ద్వారా దన లాభం. భూలాభం.శతృజయం.
వృశ్చికం:
కార్య జయం, అగ్ని,ఇందన,విధ్యుత్ ముఖ వృత్తి వ్యాపారాల్లో లాభం. భూ లాభం.అయితే కాస్త టెన్శన్ ఎక్కువే
దనస్సు:
దూర ప్రయాణాల్లో హాని, తండ్రి,తండ్రి తరపు భంధువులు,తండ్రి ఆస్తి ,పొదుపువల కష్ఠ నష్థాలు
మకరం:
అపాయం,ఆపద,ఆయుధాలు,అగ్ని,విద్యుత్, శతృవులు,పోలీసు,మిలిటరి,రైల్వే ఉధ్యోగుల వలన పీడ
కుంభం:
ఫ్రెండ్,లవర్,పార్ట్నర్,వైఫ్ వగైరాలో కష్థ నష్ఠాలు. నాభి ప్రదేశమున నొప్పి
మీనం:
శతృజయం,రోగ నివర్తి,వ్యవహార జయం,రుణ విముక్తి,భూలాభం,సోదర వర్గం వలన లాభం

ఏప్రల్ 26 నుండి జూలై 20 వరకు కన్యలో కుజ గ్రహ సంచారంవలన ద్వాదశ రాశులవారికి ఫలితాలు:
(ఇక్కడ ఇదివరకే ఉన్న శనితో కుజుడు కలవడం వలన మంచి గాని చెడ్డ గాని తీవ్ర స్థాయిలో జరుగుతాయి)
మేషం:
శతృజయం,రోగ నివర్తి,వ్యవహార జయం,రుణ విముక్తి,భూలాభం,సోదర వర్గం వలన లాభం
వృషభం:
కోపం,శ్రుంగ భంగం, పుత్ర నష్టం .కాని అనుకోని రీతిలో భూ లాభం,అదృష్ఠం వరించును
మిథునం:
దారిద్రియం,తల్లి,ఇల్లు,వాహణం,విథ్యా వగైరాల్లో చిక్కులు,చికాకులు,
కర్కాటకం:
ప్రయాణాల్లో అనుకూలత,దైర్య సాహసాలాతో లాభం, కాని సోధర హాని
సింహం:
నిష్ఠూర వాక్కు,దన నాశం,కుటుంభ కలహం,ఉష్ణ రోగాలు,కాని హఠాత్తుగా అనుకోని చోట నుండి లాభం
కన్య:
రక్తం,మంట సంభంద జబ్బులు, కోపం,ఆయుధాలు,అగ్ని,విద్యుత్ వలన హాని
తుల:
ఇందనాలు,విద్యుత్,విద్యుత్ పరికరాలు మొరాయించటం ద్వారా దన నష్ఠం. సోదర వర్గంవలన వృధా వ్యయాలు
వృశ్చికం:
ఇందనాలు,విద్యుత్,విద్యుత్ పరికరాలు ద్వారా ,సోదర వర్గం ద్వారా దన లాభం. భూలాభం.శతృజయం.
దనస్సు:
కార్య జయం, అగ్ని,ఇందన,విధ్యుత్ ముఖ వృత్తి వ్యాపారాల్లో లాభం. భూ లాభం.అయితే కాస్త టెన్శన్ ఎక్కువే
మకరం:
దూర ప్రయాణాల్లో హాని, తండ్రి,తండ్రి తరపు భంధువులు,తండ్రి ఆస్తి ,పొదుపువల కష్ఠ నష్థాలు
కుంభం:
అపాయం,ఆపద,ఆయుధాలు,అగ్ని,విద్యుత్, శతృవులు,పోలీసు,మిలిటరి,రైల్వే ఉధ్యోగుల వలన పీడ
మీనం:
ఫ్రెండ్,లవర్,పార్ట్నర్,వైఫ్ వగైరాలో కష్థ నష్ఠాలు. నాభి ప్రదేశమున నొప్పి

voiceofswamy


voiceofswamy.